Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొందరు తమ కుటుంబాలను ముందుగానే చక్కబెట్టుకుంటే,మరికొన్ని కుటుంబాల్లో వివాదాలు చుట్టుముడుతున్నాయి. సెలబ్రిటీగా ఎంతో పాపులారీటీ సాధించుకున్నా, వాళ్ళు పోయాక కుటుంబంలో చెలరేగే గొడవలు,వివాదాలు సాధారణం అయిపోయాయి కొన్ని కుటుంబాల్లో.. ఇప్పుడు దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని పరిష్కరిస్తూ పెద్ద మనిషిగా వెలుగొందిన దాసారి ఇంట్లో ఇప్పుడు చోటుచేసుంటున్న పరిణామాలు కొందరి కలచివేస్తున్నాయి.
అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి, సినీ పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు చవిచూసి,టాలీవుడ్ దిగ్గజంగా ఎదిగిన డాక్టర్ దాసరి ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందరో నటీనటులను పరిచయం చేయడమే కాదు, దర్శకులకు,టెక్నీషియన్స్ కి ఇలా వివిధ విభాగాల్లో ఎందరికో సినిమాల్లో నిలదొక్కుకోడానికి కారణమయ్యారు. తమకు దాసరి సినీ జీవితం ప్రసాదించారని చెప్పుకునేవాళ్ళు చాలామంది వున్నారు. అందుకే తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పుకుంటే అందులో దాసరి ప్రస్తావన ఉండితీరుతుంది.
ఎందరి జీవితాలకు బాటలు వేసిన దాసరి తన కొడుకులు అరుణ్ కుమార్, తారక్ ప్రభులకు మాత్రం ఏమీ చేయలేకపోయానని మనసులో బాధపడేవారు. గ్రీకు వీరుడు,ఒరేయ్ తమ్ముడు మూవీస్ లో హీరోగా వేసిన చిన్న కొడుకు అరుణ్ ని హీరోగా నిలబెట్టలేకపోయానని సన్నహితుల దగ్గర దాసరి చెప్పేవారట. ఆ సినిమాలు బ్రేక్ ఇవ్వకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ తో కొన్నాళ్ళు నెట్టుకొచ్చాడు. ఇదిలా ఉంటే పెద్ద కొడుకు తారక్ ప్రభు పెద్దలను ఎదిరించి సుశీల అనే మహిళను ప్రేమించి పెళ్లాడాడు.
అయితే ఆతర్వాత వాళ్ళు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. విడాకుల సమయంలో తనకు మనోవర్తి ఇవ్వలేదని సుశీల కోర్టుని ఆశ్రయించింది. అయితే దాసరి జోక్యం చేసుకుని వివాదం ముదరకుండా సర్దుబాటు చేసారు.అయితే దాసరి చనిపోయాక,సుశీల మళ్ళీ రోడ్డెక్కింది. తనకు, తారక్ ప్రభుకి కలిపి పుట్టిన కొడుకు పేరు కూడా దాసరి నారాయణరావేనని, తనను ఇంట్లోకి రానివ్వడం లేదని పోలీసులకు పిర్యాదు చేయడంతో మళ్ళీ వివాదం అలుముకుంది.
మహిళా సంఘాలతో కల్సి సోమవారం సాయంత్రం దాసరి ఇంటి ఎదుట నిరసనకు దిగి, తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. తన కొడుకుని హీరోగా చేస్తానని,ఆస్తిలో వాటా ఇస్తానని దాసరి మాట ఇచ్చారని ఆమె పేర్కొంది. అయితే విడాకులకు వత్తిడి చేస్తున్నారని, మామగారి గౌరవం కోసం ఇన్నాళ్లూ వెయిట్ చేసానని,సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పిన మోహన్ బాబుకి ఫోన్ చేసి అడిగితే, తనకు ఆ విషయంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారని,అందుకే బయటకు రావాల్సి వచ్చిందని సుశీల చెప్పుకొచ్చింది.
తన భర్తతో తాను ఉంటున్నా సరే, కావాలని అతనికి ఏదో నూరిపోసి,అయ్యానని ఎక్కడికో తీసుకెళ్లారని ఆరోపించింది. పాపం దాసరి గౌరవానికి భంగం కలిగిస్తూ పరువు తీసే ఈ ఘటనలు ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నాయని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
Author-Sandeep Reddy
For more interesting stories download the Lopscoop application from Google Play Store and earn extra money by sharing it on social media.
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.