Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ గెలిచి బయటకు వచ్చిన దగ్గర నుండి ప్రతి రోజు ఎదో ఒక సమయంలో కౌశల్ తన అభిమానులతో మాట్లాడుతూనే వున్నాడు...పేస్ బుక్ కావచ్చు, ఇంస్టాగ్రామ్ కావచ్చు తన ఫాన్స్ ముచ్చటిస్తూనే వున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఓపికగా సమాధానం అనేది ఇస్తూ ఉన్నాడు... హౌస్ లో వున్నప్పుడు కౌశల్ కి వ్యతిరేకంగా తేజస్వి చేసిన రచ్చ అనేది అంత ఇంత కాదు...
దానిని దృష్టిలో పెట్టుకొని ఆమెని బయటకు పంపరు. బయటకు వచ్చాక కూడా ఆమె మాటతీరులో ఎలాంటి మార్పు అనేది లేదు..తాజాగా ఆమె స్టార్ మా కొత్త ప్రోగ్రాం లాఫ్టర్ ఛాలెంజ్ కి యాంకర్ గా చేస్తుంది..ఇప్పటికే ఆమె మీద చాల మంది స్టార్ మా ఛానల్ కి రిపోర్ట్ చేశారు..తేజస్వి షో చేస్తే మేము చూడమని,ఆమెని తీసేయమని రిపోర్ట్ చేయటం విశేషం.
తాజాగా లైవ్ లోకి వచ్చిన కౌశల్ తో ఆయన ఫాన్స్ మాట్లాడుతూ అన్న మేము తేజస్వి ని టార్గెట్ చేసేమా..? నువ్వు ఒక్క మాట చెప్పు అన్న, తాను షో లో లేకుండా చేస్తామని కొందరు చెప్పారు..దీనితో కౌశల్ మాట్లాడుతూ అలాంటివి ఏమి చేయకండి. బిగ్ బాస్ గేమ్ అనేది హౌస్ లో ఉన్నంతవరకే దాని యొక్క ప్రభావం అనేది ఉండాలి. అంతేకాని బయటకు వచ్చిన తర్వాత వాటిని మనసులో పెట్టుకొని బిహేవ్ చేయటం అనేది మంచి పద్దతి కాదు...అంటూ ఫాన్స్ కి హితబోధ చేశారు..
ఇంకో అభిమాని మాట్లాడుతూ అయితే తేజస్వి బయటకు వచ్చిన కానీ, మీ మీద ఆరోపణలు చేస్తూనే వుందికదా అనేసరికి, అది ఆమె విజ్ఞప్తికి వదిలేసాను కాబట్టి మీరు ఎలాంటి వ్యాఖ్యలు ఆమె మీద చేయవద్దు అంటూ కౌశల్ చెప్పటం జరిగింది..గత రెండు రోజులు నుండి స్టార్ మా లో వస్తున్న లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రాం కి సరైన ఆదరణ అనేది రాలేదు..TRP రేటింగ్ కూడా చాల దారుణంగా వచ్చాయని తెలుస్తుంది..
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.