Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
వాటర్ బాటిల్ లో నీటి నీ తాగుతున్నారా కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ లో ఆ విశేషాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తాగడం వల్ల చాలా ప్రమాదం ఉందని మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 90 శాతానికి పైగా ఇలాగే ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ తెలియజేసింది. 11 బ్రాండ్లకు చెందిన 259 వాటర్ బాటిల్ ని పరీక్షించగా వాటిలో సూక్ష్మమైన ప్లాస్టిక్ సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ను, యూజ్‌ ఆండ్‌ త్రో వాటర్‌ బాటిల్స్‌లను సర్వ∙సాధరణంగా వినియోగిస్తుం టాం. అవి ఎంతగా మనల్ని పెనవేసుకున్నాయి అంటే వాటిని వినియోగించకుండా ఉండలేని స్థితిలోకి చేరిపోయాం.
ప్లాస్టిక్‌ వాడకం హానికరమని తెలిసినప్పటికీ తాత్కాలిక అవసరం.. వాటికి దూరంగా ఉండలేకుండా చేస్తోంది. ఒక్క నీటికే పరిమితమైన అవసరం కాదిది. మన నిత్య జీవితంలో ఖరీదు చేసి కొంటున్న ప్రతి వస్తువుతో ప్లాస్టిక్‌ను క్యారీ చేస్తున్నాం. అది అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ తాగడానికి వాటర్‌ బాటిల్స్‌ కొంటే మీరు కొంటున్న
వాటర్‌ బాటిల్స్‌లో నీటితోపాటు ప్లాస్టిక్‌ అవశేషాలు మీ శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 90 శాతానికి పైగా బాటిల్‌ వాటర్‌ వల్ల ఇలాంటి ముప్పే ఎదురవుతుందని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ అధ్యయనంలో వెల్లడైంది.
తొమ్మిది దేశాల్లో 11 బ్రాండ్లకు చెందిన 259 వాటర్‌ బాటిళ్ల నీటి శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిలో సూక్ష్మమైన ప్లాస్టిక్‌ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కేవలం 17 బాటిళ్లలో మాత్రమే ప్లాస్టిక్‌ అవశేషాలు లేవని తేలింది. ముంబై, ఢిల్లీ, చెన్నై,హైదరాబాద్‌ తదితర నగరాల్లో 19 ప్రాంతాలకు చెందిన పలు సంస్థలనుంచి సేకరించిన వాటర్‌ శాంపిళ్లలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ నీటిలో 5 వేల మైక్రోప్లాస్టిక్‌ భాగాలు ఉన్నట్లు తేలింది.
క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదని బాటిలింగ్‌ కంపెనీలు చెబుతున్నా.. ఆ నీటిలో కేన్సర్‌ వ్యాధికి కారణమయ్యే పదార్థాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలంలో ఇది ప్రజారోగ్యంపై తీవ్రమైన దుష్పభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.